మే 23 నుంచి టీజీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్టులు

మే 23 నుంచి టీజీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్టులు
  • మే 18 రేపు వెబ్​సైట్​లో హాల్​టికెట్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మే-2026 సెషన్కు సంబంధించిన డిపార్ట్​మెంటల్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి హరిత శనివారం తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను మే18  సాయంత్రం 5 గంటల నుంచి కమిషన్ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్  మినహా మిగిలిన అన్ని పేపర్లకు హాల్టికెట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ డూప్లికేట్ హాల్టికెట్లు జారీ చేయమని కమిషన్ పేర్కొంది.