
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–2 సర్వీసెస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను కమిషన్ తన వెబ్ సైట్లో పేర్కొన్నది.
నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పాత క్యాంపస్లో ఈనెల20 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. అనివార్య కారణాలతో హాజరుకాని వారికోసం ఈ నెల 25న రిజర్డ్వ్ డే ఉంటుందని చెప్పింది. కాగా, అభ్యర్థులు ఈనెల 18 నుంచి 25 వరకు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.