డిసెంబర్​ 15, 16 తేదీల్లో గ్రూప్​ 2

డిసెంబర్​ 15, 16 తేదీల్లో గ్రూప్​ 2
  • ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహణ ప్రకటించిన టీజీపీఎస్సీ

హైదరాబాద్​, వెలుగు: గ్రూప్-2 పరీక్షను డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.  గ్రూప్-2లో మొత్తం 783 పోస్టులు ఉన్నాయి.

వాస్తవానికి గ్రూప్ -2 పోస్టులకు ఈ నెల 7,8 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండె. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్ష మధ్య వారం రోజుల మాత్రమే గ్యాప్ ఉండటంతో డిసెంబర్​ నెలలో గ్రూప్​ 2 నిర్వహిస్తామని గత నెలలో టీజీపీఎస్సీ ప్రకటించింది.ఈ మేరకు గురువారం తేదీలను వెల్లడించింది. గ్రూప్ -2 పరీక్ష కోసం 5.51 లక్షల మంది  అప్లై చేసుకున్నారు.