- నేటి నుంచి వెబ్సైట్లో మెరిట్ కార్డులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్ ఈఐఎస్) నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్-2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలితాలను https://tgrjc.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో పెట్టినట్టు సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. గురుకుల కాలేజీలు, కేజీబీవీ ఎక్సలెన్స్‌లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
పరీక్షకు హాజరైన 59,310 మంది అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి వెబ్సైట్ నుంచి మెరిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాలికలు మాత్రం కేజీబీవీ, టీజీఆర్జేసీకి అప్లై చేసుకున్న వారంతా తాము చేరబోయే జూనియర్ కాలేజీ ఆప్షన్ను ఎంచుకుని మెరిట్ కార్డులు పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా జూనియర్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులకు పూర్తి సమాచారాన్ని వారి మొబైల్స్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు.
