అబిడ్స్, వెలుగు: అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీ ఎస్ హెచ్ఆర్సీ) స్పందించింది. బోడుప్పల్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–27 విద్యాసంవత్సరానికి 50 శాతం ఫీజును ముందుగానే వసూల్ చేస్తోందని వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ స్పందించారు.
పాఠశాలలు విద్యార్థుల నుంచి పుస్తకాలు, యూనిఫాంల కోసం కూడా ముందస్తు చెల్లింపులు కోరడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్‌పాఠశాలల్లో ముందస్తు ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాధికారిని కమిషన్ ఆదేశించింది.
