కరెంట్​ బిల్​లో అనుమానం ఉంటే చెక్ ​చేసుకోవచ్చు

కరెంట్​ బిల్​లో అనుమానం ఉంటే చెక్ ​చేసుకోవచ్చు

హైదరాబాద్, వెలుగు: మీ కరెంటు బిల్లు కరెక్ట్​గానే వస్తుందా? బిల్లింగ్​లేట్​అయిందని బిల్లు​ఎక్కువ వచ్చిందని అనుమానాలు ఉన్నాయా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి డిస్కం వెబ్​సైట్​లో ప్రత్యేక క్యాలిక్యూలేటర్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు. డొమెస్టిక్​ కస్టమర్స్​ కరెంటు వాడకం బిల్లు చెక్​ చేసుకునేందుకు సదరన్​డిస్కం వెబ్​సైట్​https://tgsouthernpower.org/ లో ఎనర్జీ చార్జెస్​ క్యాలిక్యూలేటర్​ ఫర్​ డొమెస్టిక్​ సర్వీస్​ను  అందుబాటులోకి తెచ్చింది. 

ఈ క్యాలిక్యూలేటర్​ లో తమ బిల్లులో పొందుపరిచిన రీడింగ్ తీసిన తేదీలు, మీటర్ రీడింగ్ వివరాలు నమోదు చేస్తే బిల్లింగ్ రోజులు, టారిఫ్ వివరాలతో సహా బిల్లు వస్తుంది. దీన్ని చూసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్​ వెల్లడించారు. రాష్ట్రంలోని రెండు పంపిణీ సంస్థల టారిఫ్ ఒకేలా ఉంటుందని, నార్తర్న్​ డిస్కం వినియోగదారులకు సైతం ఈ క్యాలిక్యూలేటర్​ఉపయోగపడుతుందన్నారు.