గుడ్ న్యూస్ .. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో విద్యార్థులకు అనుమతి

గుడ్ న్యూస్ .. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో విద్యార్థులకు అనుమతి

విద్యార్థులకు గుడ్ న్యూ్స్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ.హైదరాబాద్ లో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా విద్యార్థులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా   టోల్ ప్లాజా యూజర్ ఛార్జీలను కూడా  సవరిస్తున్నట్లు తెలిపింది.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రతి ఏటా టోల్ పన్నును సవరిస్తోంది. టోల్ పన్నును సవరించినప్పుడల్లా.. ప్రయాణికుల యూజర్ ఛార్జీలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 24 ప్రకారం టీజీఎస్ ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది.   ఈ మేరకు టోల్ ప్లాజా యూజర్ ఛార్జీని సంస్థ  జూన్ 9న  సవరించింది.  ఈ టోల్ ప్లాజా యూజర్ చార్జీల పెంపు హైదరాబాద్ సిటీ రూట్లలో టోల్ ప్లాజాలు లేకపోవడంతో ప్రభావం ఉండదు.  

ALSO READ | రోడ్డెక్కిన 45 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు

టోల్ ప్లాజా మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుంచి మాత్రమే అదనంగా ప్రతి టోల్ ప్లాజాకు రూ.10 సంస్థ వసూలు చేయడం జరుగుతుంది.   టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించకపోతే ఎలాంటి యూజర్ చార్జీ ఉండదు.

స్టూడెంట్ బస్ పాస్ చార్జీలు గత మూడు సంవత్సరాలుగా పెంచలేదు.పెరిగిన ఖర్చుల మూలంగా స్టూడెంట్ బస్ పాస్, సాధారణ ప్రయణికుల నెలవారీ బస్ పాసుల ఛార్జీలను యాజమాన్యం  సవరించింది. హైదరాబాద్ , సబర్బన్ ప్రాంతాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  సిటీ ఆర్డినరీ బస్సులు ఓవర్లోడ్ అవుతున్నాయని  సంస్థ దృష్టికి వచ్చింది.ఈ రద్దీని నివారించడానికి ఇప్పుడు అనుమతిస్తున్న సిటీ ఆర్డినరీ బస్ లతో  పాటు హైదరాబాద్ నగరంలోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో  కూడా విద్యార్థులకు  అనుమతిస్తూ బస్ పాస్ చార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది ఆర్టీసీ.

బస్ పాస్ చార్జీలు పెంపు

సాధారణ ప్రజల తీసుకునే బస్ పాసులతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను చార్జీలను కూడా ఆర్టీసీ పెంచిన సంగతి తెలిసిందే. 20 శాతం పైగా బస్ పాస్ రేట్లను ఆర్టీసీ పెంచింది. 1150 రూపాయలుగా ఉన్న ఆర్డినరీ పాస్ ధర పెంపు తర్వాత 1400 రూపాయలకు చేరింది.1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600 రూపాయలకు చేరింది. 1450 రూపాయలుగా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ 1800 రూపాయలైంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది.