
మెహిదీపట్నం వెలుగు: అంధత్వ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించగా ఆయన గెస్ట్‌గా హాజరయ్యారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కళ్లదానం చేస్తే వాటిని ఐస్‌బాక్స్‌లో సరోజినీ దేవి దవాఖానకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులో ఎలాంటి చార్జీలు తీసుకోకుండా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
ఆప్తమాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరత్నం, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజారావు, సిద్దిపేట సూపరింటెండెంట్ సంగీత షా, సరోజినీ దేవి హాస్పిటల్ సూపరింటెండెంట్ మోది పాల్గొన్నారు.