హైదరాబాద్, వెలుగు: టీజీటెట్–2026 జనవరి నోటిఫికేషన్ కు అభ్యర్థుల నుంచి తొలిరోజే భారీ స్పందన లభించింది. శనివారం రాత్రి 8.30 గంటల వరకు ఏకంగా 3,655 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్–-I కోసం 866 మంది, పేపర్-–II కోసం 2,164 మంది, రెండు పేపర్ల కోసం 625 మంది అప్లై చేసుకున్నారు. అలాగే 5,601 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించినట్టు అధికారులు తెలిపారు. పేపర్–-I కు1,415 మంది, పేపర్–-IIకు 3,158 మంది, రెండు పేపర్ల కోసం 1,028 మంది ఫీజు చెల్లించారు.
