- త్వరలో హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చనున్న యునెస్కో
- ఇండియా నుంచే థాయ్‌లాండ్‌కు ఈ కళ
బ్యాంకాక్: బ్యాంకాక్ అనగానే మనకు గుర్తొచ్చేది థాయ్ మసాజ్. ఇది అక్కడి సంప్రదాయ టెక్నిక్. త్వరలోనే థాయ్ మసాజ్‌కు అరుదైన గుర్తింపు లభించనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా దానిని గౌరవించాలని యునెస్కో నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొలంబో రాజధాని బొగోటాలో యునెస్కో ఈ నెల 9 నుంచి 14 వరకూ సమావేశం అవుతోంది. ఈ సందర్భంగానే థాయ్ మసాజ్‌కు హెరిటేజ్ గుర్తింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఎక్కడ చూసినా స్పాలే
థాయ్ మసాజ్‌ను స్థానికంగా ‘నుఆడ్ తాయి’అని పిలుస్తారు. శరీరంలోని ఆక్యుపంక్చర్ పాయింట్లను టార్గెట్ చేసుకుని ఇది సాగుతుంది. చేతి వేళ్లు, మోచేతులు, మోకాళ్లు, పాదాలను ఉపయోగించి శరీరాన్ని రిలాక్స్ మోడ్‌లోకి తీసుకొస్తారు. ఈ మసాజ్ కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన మొదలైన వాటిని దూరం చేస్తుంది. బ్యాంకాక్‌లో ఏ వీధిలో చూసిన స్పాలు, మసాజ్ సెంటర్లే కనిపిస్తాయి. ఒక గంట పాటు మసాజ్ చేస్తే అయ్యే ఖర్చు రూ.350 నుంచి మొదలవుతుంది.
ట్రైనింగ్ ఎట్ వాట్పో స్కూల్
సుమారు 2 వేల ఏండ్ల నాటి ఈ స్కిల్‌కు సంరక్షకునిగా ఉండటం ఎంతో గర్వంగా ఉందని బ్యాంకాక్‌లోని ప్రఖ్యాత బుద్ధ టెంపుల్ లోని వాట్పో స్కూల్మసాజ్ ట్రెయినర్ క్రయిరత్ ఛాంత్రాశ్రీ చెప్పాడు. థాయ్ యువకులతోపాటు ఫారినర్లు వేలాది మందికి అతడు మసాజ్‌లో ట్రయినింగ్ ఇస్తున్నాడు. పూర్వకాలంనాటి ఈ కళను ఇప్పటి వారికి చెప్పడం గొప్ప అవకాశమన్నాడు. ఈ స్కూల్లో సర్టిఫికెట్ తీసుకుంటే ఏ మసాజ్ షాప్ అయినా కళ్లు మూసుకుని ఉద్యోగం ఇస్తుంది. అంత గొప్ప చరిత్ర ఆ స్కూల్ సొంతం.
ఇండియాలోనే పుట్టింది..
శరీరాన్ని రిలాక్స్ చేసేలా ఈ కళ ఇండియాలోనే పుట్టింది. అక్కడి నుంచి సుమారు 2,500 ఏండ్ల క్రితం థాయ్‌లాండ్ కు చేరింది. టెంపుల్స్‌లో అప్పట్లో గురువులు ఈ కళను శిష్యులకు నేర్పేవారు. ఆ తర్వాత కుటుంబంలో వారికి నేర్పేవారు. 19వ శతాబ్ధంలో థాయ్‌లాండ్ కింగ్ రామా 3 ఆ కళ గొప్పతనానికి సంబంధించి మెళకువలను వాట్పో టెంపుల్లోని రాళ్లపై అప్పటి గురువులు చెక్కారు. అయితే 1962లో అక్కడ స్కూల్ ఏర్పాటు తర్వాతే ఎక్కువగా ఈ కళను ప్రాక్టీస్ చేయడం మొదలైంది. ఇప్పటి వరకూ 2 లక్షల మంది ఇక్కడ ట్రయినింగ్ తీసుకుని 145 దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు.

