థాయ్‌లాండ్ కొత్త పీఎం అనుతిన్

థాయ్‌లాండ్ కొత్త పీఎం అనుతిన్

బ్యాంకాక్: థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ తదుపరి ప్రధానిగా భుమ్‌‌‌‌జైతై పార్టీ నేత అనుతిన్ చార్న్‌‌‌‌విరాకుల్​ను ఆ దేశ పార్లమెంట్​ ఎన్నుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌‌‌‌లో ప్రతినిధుల సభలో మొత్తం 311 ఓట్లు సాధించి ప్రత్యర్థి చైకాసెమ్ నిటిసిరిని ఓడించారు. కాంబోడియా మాజీ అధ్యక్షుడు హన్​సేన్​తో ఫోన్ కాల్ సందర్భంగా  థాయ్‌‌‌‌ మాజీ ​ప్రధాని షినవత్ర ఆయనను అంకుల్ అని సంబోధించడం వివాదాస్పదంగా మారింది. 

థాయ్ సైనిక ఉన్నతాధికారి తనకు ప్రత్యర్థిగా మారారంటూ పలు కాన్ఫిడెన్షియల్ విషయాలనూ హన్ సేన్​తో పంచుకున్నారు. ఈ ఫోన్ కాల్ లీక్ కావడంతో షినవత్రాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రంగా ఉన్న సమయంలో పొరుగుదేశం నేతతో కీలక విషయాలు పంచుకున్న తీరు వివాదాస్పదమైంది. 

దానిపై విచారణ జరిపిన ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం షినవత్ర తీరు నైతిక  ప్రమాణాలను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం ఇటువంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని పేర్కొంటూ ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.