బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వరదల కారణంగా చనిపోయినోళ్ల సంఖ్య 80 దాటింది. దక్షిణ థాయ్‌లాండ్‌లో కురిసిన భారీ వర్షాలతో కనీసం 82 మంది మృతి చెందారని అధికారులు గురువారం ప్రకటించారు. ఒక్క సాంగ్‌ఖ్లా ప్రావిన్సులోనే 55 మంది చనిపోయారని వెల్లడించారు.
దాదాపు 10 లక్షల ఇండ్లు, 30 లక్షల మందిపై వర్షాలు, వరదల ప్రభావం పడిందని తెలిపారు. మొత్తం 12 ప్రావిన్సులలో కుండపోత వానలు కురిసి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పారు. కొన్ని ప్రావిన్సుల్లో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకొన్ని ప్రావిన్సుల్లో వరద భారీ స్థాయిలోనే ఉన్నదని పేర్కొన్నారు.
పట్టాణి, నఖోన్ సి తమ్మరాట్ ప్రావిన్సుల్లో వరద ఇంకా తగ్గలేదన్నారు. వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
