థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీ: సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌ బోణీ

థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీ: సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌ బోణీ

బ్యాంకాక్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌.. థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీలో బోణీ చేశారు. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో ఆరోసీడ్‌‌‌‌ సింధు 21–9, 21–12తో తుంగ్‌‌‌‌ సియోయ్‌‌‌‌ టోంగ్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ)పై గెలిచింది. 33 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ షట్లర్‌‌‌‌ స్మాష్‌‌‌‌లు, ర్యాలీలతో చెలరేగింది.

తొలి గేమ్‌‌‌‌లో 4–4 స్కోరు తర్వాత సింధు వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌‌‌‌లోనూ అదే జోరును కొనసాగించింది. 3–3 స్కోరు తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో దేవిక సిహాగ్‌‌‌‌ 21–19, 13–21, 21–15తో నట్సుకి నిడైరా (జపాన్‌‌‌‌)పై, మాళవిక బన్సోద్‌‌‌‌ 13–21, 26–24, 21–13తో వెన్ యు జాంగ్‌‌‌‌ (కెనడా)పై గెలిచింది.

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఏడోసీడ్‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌ 21–16, 21–17తో జియా హెంగ్‌‌‌‌ జాసన్‌‌‌‌ టిహ్‌‌‌‌ (సింగపూర్‌‌‌‌)పై గెలవగా,  శ్రీకాంత్‌‌‌‌ 21-–14, 21–-15తో  ఎనిమిదో సీడ్‌‌‌‌ లోహ్‌‌‌‌ కీన్‌‌‌‌ యు (సింగపూర్‌‌‌‌)కు షాక్‌‌‌‌ ఇచ్చాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో ఉన్నతి హుడా 21–11, 17–21, 16–21తో పోర్న్‌‌‌‌పావీ చొచువాంగ్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో, తన్వీ శర్మ 17–21, 8–21తో హినా అకెచీ (జపాన్‌‌‌‌) చేతిలో, అన్మోల్‌‌‌‌ ఖర్బ్‌‌‌‌ 21–19, 13–21, 18–21తో చెన్‌‌‌‌ యు ఫి (చైనా) చేతిలో ఓడారు. 

మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో అశిత్‌‌‌‌ సూర్య–అమృత ప్రథమేశ్‌‌‌‌ 22–24, 11–21తో సాయ్‌‌‌‌ ఫు చెంగ్‌‌‌‌–సుంగ్‌‌‌‌ యు సున్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ) చేతిలో, రోహన్‌‌‌‌ కపూర్‌‌‌‌–రుత్వికా శివాని 15–21, 10–21తో సుపక్‌‌‌‌ జోమ్‌‌‌‌కోహ్‌‌‌‌–ఒమ్నిచా (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో ఓడగా, మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో తరుణ్‌‌‌‌ మానేపల్లి 12–21, 16–21తో కొకి వాట్నాబే (జపాన్‌‌‌‌) చేతిలో, ఆయుశ్‌‌‌‌ షెట్టి 13–21, 21–17, 4–21తో కొడాయ్‌‌‌‌ నరోకా (జపాన్‌‌‌‌) చేతిలో కంగుతిన్నారు.