టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది జాసన్ సంజయ్కు డైరెక్టర్గా తొలి మూవీ కావడం విశేషం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ 2024లోనే వచ్చింది. ఓ వీడియో మరియు పోస్టర్ రిలీజ్ చేసి సినిమా రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ తరుణంలో సోమవారం (2025 నవంబర్ 10న) సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు "SIGMA" అనే టైటిల్ ఫిక్స్ చేసి, సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ను షేర్ చేశారు. పోస్టర్ సినిమా కథనాన్ని రివీల్ చేస్తూనే, ఇంట్రెస్ట్ పెంచుతుంది. "సిగ్మా" అంటే ఒక ఫియర్‌లెస్ తోడేలు. అంటే, ఎవరితో సంబంధం లేకుండా, ఒక అండర్‌డాగ్‌లా వచ్చి, తన ఓన్ రూల్స్‌తో, భారీ టార్గెట్లను రీచ్ అయ్యే క్యారెక్టర్ అన్నమాట.
పోస్టర్ కూడా అదే అండర్ వరల్డ్ కథనాన్ని చూపిస్తుంది. డబ్బు కట్టలు, గోల్డ్ బార్లు, ఏనుగు దంతాలు.. ఇలా కోట్ల విలువైన డబ్బుల కట్టలు గుట్టగా పోసి వాటిపై సందీప్ కిషన్ కూర్చున్న తీరు ఆకట్టుకుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్ ఉందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది.
Presenting the Title of #JSJ01 - #SIGMA⚡
— Lyca Productions (@LycaProductions) November 10, 2025
The quest begins. 🎯@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @Cinemainmygenes @krishnanvasant @Dir_sanjeev #BenjaminM @hariharalorven @ananth_designer @SureshChandraa @UrsVamsiShekar… pic.twitter.com/Dggm6zx3Il
మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అనే పదాన్ని చాలా సందర్భాల్లో వినే ఉంటాం. అదే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో సుపరిచితుడైన సందీప్ కిషన్, ఈ సినిమాతో హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో 'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది.
