Varisu Trailer : 'వారిసు' ట్రైలర్ రిలీజ్

 Varisu Trailer : 'వారిసు' ట్రైలర్ రిలీజ్

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'వారసుడు'. తమిళంలో 'వారిసు'గా వస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ తమిళ వర్షన్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తూంటే.. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు అకట్టుకునేలా ఉన్నాయి. థమన్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ హైలేట్ గా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. 

విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు.