బంజారాహిల్స్ లో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్‭కు తలసాని భూమిపూజ

బంజారాహిల్స్ లో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్‭కు తలసాని భూమిపూజ

పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని శ్రీరామ్ నగర్‭లో.. రూ.4 కోట్ల నిధులతో నిర్మించే మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్‭కు మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మీ కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని.. నిరుపేదలు అధికంగా నివసించే బస్తీలలో అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించేలా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మల్టీ పర్పస్ కాంప్లెక్స్ లో అంగన్ వాడీ సెంటర్, ఫంక్షన్ హాల్, బస్తీ దవాఖాన నిర్మాణం జరుగుతాయని తెలిపారు.

ఏడాది లోపు భవన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తలసాని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి KTR ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్ నగరం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని తలసాని వెల్లడించారు.