
సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం (Guntur kaaram). ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో తల్లికి దూరమైన కొడుకుగా మహేష్ కనిపించి..కొన్ని సీన్స్లో తనదైన భావోద్వేగాన్ని పండించాడు.
గుంటూరు కారం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అందులో భాగంగా వచ్చిన ధమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి, అండ్ ఓహ్ మై బేబీ సాంగ్స్ కుర్రకారుకి పిచ్చెక్కించేశాయి. ఇక రీసెంట్ గా అమ్మ సాంగ్ రిలీజ్ చేసారు. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ స్వాగ్కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
లేటెస్ట్గా తమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. గుంటూరు కారం నుంచి ఆరు పాటలను విని ఎంతో ఎంజాయ్ చేశారు. ఇక త్వరలోనే ఏడవ పాటను యాడ్ చేయబోతున్నట్లు తెలిపారు."గుంటూరు కారం నుంచి త్వరలో మరోసారి సాంగ్ యాడ్ చేయబోతున్నాం ఈ సాంగ్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎంతో స్పెషల్గా ఉంటుంది. ఫ్యాన్స్కి ఫీస్ట్ గ్యారెంటీ ఇదే నా ప్రామిస్" అంటూ తన ట్వీట్లో వెల్లడించాడు.
దీంతో తమన్ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమన్ ట్వీట్స్ చూసిన సూపర్ ఫ్యాన్స్ ఆ సాంగ్ కోసం ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం అంటూ రీట్వీట్ చేస్తున్నారు. తమన్ చేసిన ప్రామిస్ లా స్ట్రాంగ్గా ఉంటుందో లేదో చూడాలి.
#SuperStar ‘s #SUPERSIX Tracks are Here ❤️✨?️#GunturkaaramJukeBox https://t.co/c4DNzlTvRC…
— thaman S (@MusicThaman) January 29, 2024
Will add one More Soooooooonnnn ?️#No7Track ?????????
Once I am Ready With the lyrical Video
I want to make it A very very Special One for our dear #SuperStar… pic.twitter.com/bN22idEyZT
నిజానికి గుంటూరు కారం సినిమాకు మొదటిరోజు నుండే మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ రికార్డ్ లెవల్లో కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ.231 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజనల్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక పాజిటివ్ టాక్ వస్తే..ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టేదో ఊహించుకోండి.