టీఎఫ్‌సీసీ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్

టీఎఫ్‌సీసీ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్

ప్రస్తుతం జరుగుతున్న టీఎఫ్‌సీసీ ఎన్నికలపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎలక్షన్స్  చూస్తుంటే చాంబర్‌ ఎదిగిందని సంతోష పడాలా, జనరల్‌ ఎలెక్షన్స్‌లా మారిపోయిందని సిగ్గుపడాలో అర్థంకావడంలేదని. సభ్యులు ఎందుకు పోటీ పడుతున్నారో? దేనికోసం పోటీ పడుతున్నారో? తెలియడం లేదన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను చాలా ఎలెక్షన్స్‌ చూశాను, చాంబర్‌ ప్రెసిడెంట్‌గా గెలిచాను కూడా. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు. ఈ ఎలెక్షన్స్‌ ప్రచారాలు చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనియ్యాంశం అవుతున్నాయి.