
నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ భారీ వసూళ్లు రాబడుతోంది. లేటెస్ట్గా మేకర్స్ (ఫిబ్రవరి 10న) మూడు రోజుల కలెక్షన్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
" తండేల్ బ్లాక్ బస్టర్ సునామి.. 3 రోజుల్లో రూ.రూ.62.37కోట్లకి పైగా భారీ గ్రాస్ వసూళ్లను సాధించింది. తండేల్ చూడటం కోసం మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి!" అంటూ మేకర్స్ వెల్లడించారు.
ఇకపోతే ఇండియాలో 3 రోజుల్లో తండేల్ సినిమాకు రూ.35.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ పేర్కొంది. మూడో రోజైన ఆదివారం తండేల్ వసూళ్లు కాస్తా పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఆదివారం 62.07 శాతం తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్ మూవీ 2 రోజుల్లో రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తండేల్కు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.21.27కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
The 'BLOCKBUSTER LOVE TSUNAMI' collects MASSIVE ??.?? ??????+ ????? ????????? in 3 days ❤️??⚓
— Thandel (@ThandelTheMovie) February 10, 2025
Fastest '????+ ???????' for Yuvasamrat @chay_akkineni ??
Book your tickets for BLOCKBUSTER #Thandel now!
?️ https://t.co/5Tlp0WNszJ… pic.twitter.com/rZlRQHYezo
సాక్నిల్క్ ప్రకారం:
ఇండియాలో ఫస్ట్ డే రూ.11.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజున రూ.12.1 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజున రూ. 12.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ వెల్లడించింది.
ఇక తండేల్ మూవీ ఫస్ట్ డే తెలుగులో రూ.11.3 కోట్లు, హిందీలో రూ.12 లక్షలు, తమిళంలో రూ.8 లక్షలు వసూలు చేసింది. దీంతో శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.21.27 కోట్లు వసూలు చేసింది. ఇది నాగ చైతన్య కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్‌గా నిలిచింది.
2021లో విడుదలైన లవ్ స్టోరీ సినిమాను అధిగమించింది. లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ డే దాదాపు రూ.10.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌ను సొంతం చేసుకుంది.