బర్త్‌‌డే సందర్భంగా ఇంటరెస్టింగ్ అప్‌‌డేట్

 బర్త్‌‌డే సందర్భంగా  ఇంటరెస్టింగ్ అప్‌‌డేట్

ప్రయోగాత్మక చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ  స్పెషల్ ఇమేజ్ క్రియేట్‌‌ చేసుకున్న విక్రమ్... ప్రస్తుతం ‘తంగలన్‌‌’ అనే డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌ మూవీలో నటిస్తున్నాడు. పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌‌‌‌ అంచనాలు పెంచాయి. ఈ నెల 17న విక్రమ్ బర్త్‌‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంటరెస్టింగ్ అప్‌‌డేట్ ఇవ్వబోతున్నట్టు తన కొత్త పోస్టర్‌‌‌‌తో ప్రకటించారు మేకర్స్. ఇక పోస్టర్‌‌‌‌లో విక్రమ్.. ఫుల్‌‌గా గడ్డం, ఒత్తుగా జుట్టు పెంచి,  చేతిలో ఆయుధంతో ఇంటెన్స్‌‌ లుక్‌‌లో కనిపిస్తున్నాడు.

 సూర్యుని కాంతిలో నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే రకరకాల గెటప్స్‌‌తో మెస్మరైజ్ చేసిన విక్రమ్.. ఈ సినిమా మరో కొత్త గెటప్‌‌లో కనిపించనున్నట్టు అర్ధమవుతోంది.  ఇది విక్రమ్‌‌కి 61వ చిత్రం. ఇదొక పిరియాడికల్ మూవీ. 19వ శతాబ్ధంలోని కోలార్‌‌ గోల్డ్‌‌ ఫీల్డ్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌‌‌‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తమిళంతోపాటు  తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.