Tharun Bhascker: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మూవీ అప్డేట్.. ఆసక్తిగా కాన్సెప్ట్ వీడియో

Tharun Bhascker: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మూవీ అప్డేట్.. ఆసక్తిగా కాన్సెప్ట్ వీడియో

దర్శకుడిగానే కాక నటుడిగానూ ఆకట్టుకుంటున్న తరుణ్ భాస్కర్.. ‘ఓం శాంతి శాంతి శాంతి:’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈషా రెబ్బా హీరోయిన్‌‌‌‌.  రూరల్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో వస్తున్న ఈ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌కు ఎ ఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. శనివారం టైటిల్‌‌‌‌ను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఓంకార్ నాయుడు అనే పాత్రలో తరుణ్ భాస్కర్‌‌‌‌‌‌‌‌ను, కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా ఈషాను పరిచయం చేశారు.పెళ్లి తర్వాత పందెం కోళ్లను తలపించేలా వీళ్లిద్దరి మధ్య సాగే పోట్లాడే సినిమా కాన్సెప్ట్‌‌‌‌ అన్నట్టుగా వీడియోను డిజైన్ చేశారు.

బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు.  జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 1న సినిమా విడుదల చేయనున్నట్టుప్రకటించారు.