
కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు వివేక్ అగ్నిహోత్రి. తాజాగా అతడు బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనను బాలీవుడ్ పూర్తిగా దూరం పెట్టిందన్నాడు. తన సినిమాలకు మధ్య తరగతి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉందని వివరించాడు. కరణ్ జోహార్ సినిమాల్లో లాగా వాస్తవానికి దూరంగా తన సినిమాలు, అలాంటి సినిమాల వల్లే ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారని, అందుకే బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేయాలని కోరుతున్నారంటూ వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ మాఫియా ఇప్పుడు తనతో పాటు కంగనా రనౌత్‌ను కూడా టార్గెట్ చేసిందన్నాడు. ఎందుకంటే మేమిద్దరం తప్పులను ధైర్యంగా ప్రశ్నిస్తాం కాబట్టే. అందుకే.. తమను ఈ పరిశ్రమ దూరం పెట్టిందంటూ సంచలన కామెంట్స్చేశాడు. మరి.. వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ కామెంట్స్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా స్పందింస్తుందో చూడాలి.