వరుసగా 11వ నెల ఆటో సేల్స్‌‌ అంతే

వరుసగా 11వ నెల  ఆటో సేల్స్‌‌ అంతే

న్యూఢిల్లీ : ప్యాసెంజర్ వెహికిల్‌‌(పీవీ) అమ్మకాలు వరుసగా 11వ నెలలోనూ పడిపోయాయి. ఫెస్టివల్ సీజన్ కూడా కొనుగోలుదారుల సెంటిమెంట్‌‌ను పెంచడంలో విఫలమైంది. దీంతో సెప్టెంబర్‌‌‌‌ నెలలోనూ పీవీ సేల్స్‌‌ 23.69 శాతం కిందకు పడినట్టు సియామ్ తాజా డేటాలో వెల్లడైంది. గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో 2,92,660 యూనిట్ల ప్యాసెంజర్​ వెహికిల్స్‌‌ అమ్ముడుపోతే.. ఈ ఏడాది అవి కేవలం 2,23,317 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. పీవీ సేల్స్ గత రెండు దశాబ్దాలో ఎన్నడూ చూడనంతగా ఆగస్ట్‌‌ నెలలో 31.57 శాతం పడిపోయాయి. ఎకానమీ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల ఆటో సేల్స్ పెరుగుతాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్(సియామ్) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దేశీయంగా కారు అమ్మకాలు కూడా సెప్టెంబర్ నెలలో 33.4 శాతం పడిపోయి 1,31,281 యూనిట్లుగా ఉన్నాయి.

ఇవి గతేడాది ఇదే నెలలో 1,97,124 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఈ నెలలో మోటార్‌‌‌‌సైకిల్స్ అమ్మకాలు గత రెండు దశాబ్దాలతో పోలిస్తే అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. 2009 జనవరిలో కమర్షియల్ వెహికిల్ సేల్స్ భారీ ఎత్తున క్షీణించాయి. మోటార్ సైకిల్ సేల్స్ సెప్టెంబర్ నెలలో 23.29 శాతం తగ్గిపోయి 10,43,624 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తంగా టూవీలర్ సేల్స్ సెప్టెంబర్‌‌‌‌లో 22.09 శాతం తగ్గిపోయాయి. కమర్షియల్ వెహికిల్స్ సేల్స్ 39.06 శాతం డౌన్‌‌ అయి 58,419 యూనిట్లుగా ఉన్నాయి.