ఆగస్ట్ 1న హైదరాబాద్ లో సౌతిండియా మీడియా సమ్మిట్

ఆగస్ట్ 1న హైదరాబాద్ లో సౌతిండియా మీడియా సమ్మిట్
  • ఆగస్ట్ 1న హైదరాబాద్ లో సౌతిండియా మీడియా సమ్మిట్
  • హాజరుకానున్న గవర్నర్ తమిళిసై, జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామి
  • మీడియా, ఇండస్ట్రీ ప్రముఖులతో చర్చలు

ఫోర్త్ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ నిర్వహిస్తున్న సౌతిండియా మీడియా సమ్మిట్ 4వ ఎడిషన్ ఆగస్టు 1న హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో విశాక ఇండస్ట్రీస్ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామితో పాటు పలు రంగాల ప్రముఖులు పాల్గొంటారు. లీడర్ షిప్ అంశంపై సెషన్ తో మొదలయ్యే సమ్మిట్ లో ఫైర్ సైడ్ చాట్, ఎఫెక్టివ్ స్పోర్ట్స్ మార్కెటింగ్, మహిళా శక్తి లాంటి అంశాలపై ప్యానెల్ చర్చలు ఉంటాయి. దేశంలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకుంటారు. శశి సిన్హా (ఐపీజీ మీడియా బ్రాండ్స్ సీఈవో, బ్రాడ్ క్టాస్ట్ అలయన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఇండియా ఛైర్మన్), ఆర్ణబ్ గోస్వామి (రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ ఎండీ), విక్రమ్ సఖుజా (మేడిసన్ మీడియా, ఓఓహెచ్ గ్రూప్ సీఈవో)తో ఫైర్ సైడ్ చాట్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఎదుగుతున్న స్టార్టప్స్, చిన్న పట్నాల్లో జాతీయ మీడియా పాత్ర లాంటి అంశాలపై చర్చతో పాటు మైండ్-బాడీ-సోల్ అంశంపై దుష్యంత్ శ్రీధర్ టాక్ ఉంటుంది.

‘‘దక్షిణాదిలో హైదరాబాద్ చాలా కీలక మార్కెట్. హైదరాబాద్ లో మొదటిసారిగా ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం మేం గర్వంగా భావిస్తున్నాం. సమ్మిట్ కు స్పందన అద్భుతంగా ఉంది’’ అన్నారు ఫోర్త్ డైమెన్షన్ మీడియా సీఈవో శంకర్. దక్షిణాదిలో బ్రాండ్ల ప్రమోషన్ లో ఫోర్త్ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ కీలకంగా పని చేస్తోంది. సుదీర్ఘ అనుభవంతోనే సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ నిర్వహిస్తోంది. దేశంలో పలు రంగాల ప్రముఖులను ఒకే వేదిక మీదికి తెచ్చి వారి అనుభవాలను అందరితో పంచుకునేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సమ్మిట్ నాలుగో ఎడిషన్ కు హైదరాబాద్ వేదిక కానుంది.

ఈ సమ్మిట్ లో హవాస్ మీడియా సీఈవో మోహిత్ జోషి, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఎండీ, సీఈవో గౌతమ్ గుప్తా, రిచ్ మౌంట్ వెంచర్స్ ఫ్యామిలీ ఫౌండర్ కార్తికేయ మ్యాడం, నెక్సాన్ పెయింట్స్ సేల్స్ డైరెక్టర్ ప్రవీణ్ చౌదరి, డిస్నీ స్టార్ యాడ్ సేల్స్, స్ట్రాటజీ హెడ్ అమృత నాయర్, హవాస్ మీడియా గ్రూప్ సీఈవో రాణా బారువా, హిందూ గ్రూప్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సురేష్ బాలకృష్ణ, మాడిసన్ మీడియా గ్రూప్ సీఈవో విక్రమ్ సఖుజా, ఏబీఆర్ కేఫ్, బేకర్స్ ఎండీ శశాంక్ అనుముల, బాంటియా ఫర్నిచర్స్ ఫౌండర్, ఎండీ సురేందర్ బాంటియా, హోమియో కేర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ మోర్లవార్, ఓమినికామ్ మీడియా గ్రూప్ సీఈవో కార్తిక్ శర్మ, క్విక్ హీల్ టెక్నాలజీస్ ఫౌండర్, ఎండీ డాక్టర్ కైలాష్ కత్కర్, వీకేసీ గ్రూప్ ఎండీ వీకేసీ రజాక్, సాయి సిల్క్స్ కళామందిర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ చలవాది, గో స్పోర్ట్స్ ఫౌండేషన్ సీఈవో దీప్తి బోపయ్య, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అండ్ తెలుగు టాలన్స్ ప్రిన్సిపల్ ఓనర్ అభిషేక్ రెడ్డి కంకణాల, జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, హవాస్ ప్లే ఎండీ ఆర్.వెంకటసుబ్రమణ్యన్, బాంబినో పాస్టా ఫుడ్స్ మార్కెటింగ్ జీఎం రాఘవ్ ఆనంద్ డీవీ, ఫెర్రాన్ స్టీల్స్ బిజినెస్ హెడ్ సి.శరత్ మోహన్, గ్రూప్ ఎం మీడియా ఎండీ మౌసుమి కర్, టాప్లో గ్రూప్ కోఫౌండ్ శయిష్ట సభర్వాల్, హవాస్ ఇండియా సీఎంవో ప్రీత దాస్ గుప్తా, మౌటో ఎలక్ట్రిక్ మొబిలిటీ కోఫౌండర్ యాస్మీన్ జవహరాలి, వన్ నేటివ్ అడ్వర్టయిజింగ్ కోఫౌండర్ దీపక్ కర్నానీ, టెన్2హండ్రెడ్ ఫౌండర్ సంపత్ మోహన్, ఓలెకామ్ మీడియా బిజినెస్ హెడ్ ఎస్.దివాకర్, రిపోర్టర్ టీవీ నెట్ వర్క్ ప్రెసిడెంట్ అనిల్ అయిరూర్, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ (ఏపీ) డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ పంకజ్ బెల్వారియర్, బాంటియా ఫర్నిచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ బాంటియా పాల్గొంటారు.