జమ్మూ కశ్మీర్ దాడులకు నిరసనగా ఆప్ నిరసన

జమ్మూ కశ్మీర్ దాడులకు నిరసనగా ఆప్ నిరసన

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ వరుస దాడులకు నిరసనగా ఈ రోజు ఆప్ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. దీనికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. జమ్మూ కశ్మీర్ లో నెల రోజుల్లో 9 మంది హిందువులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. మే 12న బుద్గామ్ లోని పండిట్ రాహుల్ భట్, మే 13న పోలీస్ కానిస్టేబుల్ రియాజ్ ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. మే 17న బారాముల్లా మద్యం దుకాణంపై దాడి చేయడంతో సేల్స్ మెన్ రంజిత్ సింగ్ మరణించాడు. మే 25 బుద్గాంలో టీవీ నటి అమ్రిన్ భట్ ను చంపారు. మే 31న కుల్గామ్ లోని గోపాల్ పొరలో హిందూ ఉపాధ్యాయురాలు రజనీ బాలాను హత్య చేశారు. నిన్న రాజస్థాన్ కు చెందిన విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇవాళ మరో వలసకూలీని హత్య చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 17 మంది హత్యకు గురయ్యారని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హోం మినిస్టర్ అమిత్ షా హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం...

గెలుపు దిశగా ఇంగ్లండ్‌‌‌‌

నెటిజన్ ఓవరాక్షన్.. ఘాటుగా రిప్లై ఇచ్చిన రానా