
లార్డ్స్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతున్నది. 277 రన్స్ టార్గెట్ ఛేదించే క్రమంలో శనివారం మూడో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 216/5 స్కోరు చేసింది. విజయానికి 61 పరుగల దూరంలో ఉంది. రూట్ (77 బ్యాటింగ్), బెన్ ఫోక్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 69 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (54) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 90 రన్స్ జోడించారు. లీస్ (20), క్రాలీ (9), పోప్ (10), బెయిర్‌స్టో (16) విఫలమయ్యారు. జెమీసన్‌కు 4 వికెట్లు దక్కాయి. అంతకుముందు 236/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 రన్స్‌కు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (108), టామ్ బ్లండెల్ (96) రాణించారు .