రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుకొచ్చాయి. ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు. 

ఇటు పార్లమెంట్‌ ఉభయ సభలు తరచూ వాయిదాపడడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో గళం వినిపించింది లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. ఎప్పుడూ పార్లమెంట్‌ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నారు. పార్లమెంట్‌లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనే’ అంటూ కామెంట్స్ చేశారు. 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మూడో రోజూ విపక్షాలు ఆందోళలు చేస్తున్నాయి. వర్షాకాల సమావేశాల మూడో రోజు, ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరి ఉమ్మడి ప్రతిపక్షంలో పాల్గొన్నారు. సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే నిత్యావసరాలపై జీఎస్టీరేట్ల పెంపు, పెరిగిన ధరలు తదితర అంశాలపై నిరసన తెలపాలని నిర్ణయించాయి.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మధ్యాహ్నాం కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. సభలో వ్యవహరించాల్సిన తీరు.. విపక్షాల విమర్శలకు తగిన సమాధానాలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా మోడీ మంత్రులకు సూచించనున్నట్లు తెలుస్తోంది.