వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి

వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి

వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి
అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్

ఖైరతాబాద్, వెలుగు : వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఫెడరేషన్‌కు రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని అఖిల భారత వడ్డెర ఓదే భోవి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేముల లక్ష్మణ్, గుంజ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎత్తరి మారయ్యను ఎన్నుకున్నారు. అనంతరం మారయ్యకు లక్ష్మణ్ నియమాక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్  మాట్లాడుతూ..  ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరా స్థలం కేటాయించి వడ్డెర భవనం నిర్మించాలన్నారు.

వడ్డెర బాల, బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదశాత్తు మరణిస్తే వారికి రూ. 15లక్షలు, గాయపడ్డ వారికి రూ.7.50లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం చెల్లించాలని ఆయన కోరారు.  సమావేశంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు వేముల తిరుమలాదేవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీ నారాయణావు తదితరులు పాల్గొన్నారు.