దోస్త్ సెకండ్ ఫేజ్​లో 49,267 మందికి సీట్లు

దోస్త్ సెకండ్ ఫేజ్​లో 49,267 మందికి సీట్లు
  • నేటి నుంచి థర్డ్ ఫేజ్ ప్రాసెస్ షురూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది. దోస్త్ ద్వారా మొత్తం 53,184 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. 49,267 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 35,195 మంది ఫస్ట్ ఆప్షన్ తో.. 14,072 మంది సెకండ్ ఆప్షన్​తో  సీట్లు పొందారు. తక్కువ ఆప్షన్లు పెట్టిన 3,917 మందికి సీట్లు అలాట్ కాలేదు. ఈ మేరకు సీట్ల అలాట్ వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​ చైర్మన్ ఆర్.లింబాద్రి శుక్రవారం వెల్లడించారు. 

సీట్లు పొందిన స్టూడెంట్లు జులై 14లోపు ఆన్​లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించా రు. దోస్త్ మొదటి విడతలో 73,220 మందికి సీట్లు అలాట్ కాగా..వారిలో 49 వేలమంది ఆన్​లైన్​ సెల్ఫ్​రిపోర్టు చేసినట్లు చెప్పారు. శనివారం  నుంచి దోస్త్ థర్డ్ ఫేజ్ ప్రక్రియ ప్రారంభించను న్నట్లు లింబాద్రి వెల్లడించారు. జులై 14 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంద న్నారు. జులై 15 వరకు వెబ్ ఆప్షన్లు, 20న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని ప్రకటించారు. 21 నుంచి 24 వరకు ఆన్​ లైన్ సెల్ఫ్ రిపోర్టు చేయాలని సూచించారు. జులై 24 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు మొదలవుతాయని పేర్కొన్నారు.