రామగుండంలో ర్యాగింగ్ నలుగురు విద్యార్థులు సస్పెన్షన్​

రామగుండంలో ర్యాగింగ్ నలుగురు విద్యార్థులు సస్పెన్షన్​

గోదావరిఖని, వెలుగు : రామగుండం మెడికల్​ కాలేజీలో మూడు రోజుల కింద ఫస్ట్​ఇయర్​ స్టూడెంట్లను ర్యాంగింగ్​ చేసిన నలుగురు సెకండియర్​ స్టూడెంట్లపై యాంటీ ర్యాగింగ్​కమిటీ  గురువారం చర్య లు తీసుకున్నది. ర్యాగింగ్​చేసిన నలుగురి పేరెంట్స్​ను పిలిపించి విచారణ జరిపింది. ర్యాగింగ్ ​చేసింది నిజమేనని తేలడంతో సస్పెండ్​ చేసినట్టు ప్రిన్సిపాల్ ​డాక్టర్​ హిమబిందు సింగ్​ తెలిపారు. ఒకరిని ఆరు నెలల పాటు, మరో ఇద్దరిని నాలుగు నెలలు కాలేజీ నుంచి, మరో స్టూడెంట్​ను హాస్టల్​ నుంచి ఆరు నెలలు సస్పెండ్ ​చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత సోమవారం రాత్రి ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్ల గదిలోకి వెళ్లిన సెకండియర్​ స్టూడెంట్స్​ ట్రిమ్మర్​తో జుట్టు కత్తిరించారు. ఐదుగురు బాధితులుండగా ఒకరు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్​కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా విచారణ జరిపారు. గురువారం రామగుండం సీపీ ఎం.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ర్యాగింగ్​కు పాల్పడవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని స్టూడెంట్లతో ప్రతిజ్ఞ చేయించారు.