అధికారుల నిర్లక్ష్యం..గొర్రెలకు మేత కరువు

అధికారుల నిర్లక్ష్యం..గొర్రెలకు మేత కరువు

ఎండలు మండిపోతున్నాయి.. ఎక్కడా కనీసం గరక కూడా దొరకని పరిస్థితి. గొర్ల కాపరులు మందలను తోలుకుని నెలల తరబడి నీళ్లజాడ వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇక 20, 30 శాల్తీల గొర్రెలున్న పెంపకందారులు గ్రామాల్లో మేత కోసం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుం చి అందాల్సిన దాణా రాకపోవడంతో అరకొర మేత వేస్తూ గొర్రెల ప్రాణాలు నిలబెడుతున్నారు.

రూ.247.81 కోట్లు కేటాయింపు

ప్రభుత్వం గొల్ల, కురుమల కోసం రెండేళ్లలో రెండు విడతలుగా 7,28,874 గొర్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఇప్పటివరకు పశుసంవర్థకశాఖ 3 లక్షల 70 వేల గొర్లు పంపిణీ చేసింది. ఒక్కోయూనిట్‌ విలువ లక్షా 25వేలు,వీటిలో రూ.31,250 లబ్ధిదారుడి వాటా కాగా ప్రభుత్వం రూ.93,750 ఇచ్చింది. ఇందులోలక్షా 11 వేలు గొర్లు కొనేందుకు, వాటి రవాణాకురూ.6,300, బీమాకు రూ.3,800, దాణాకురూ.3,400, మందులకు రూ.420 కేటాయించారు. అంటే దాణా కిలోకు రూ.16.70 చొప్పున206 కిలోల దాణా సరాఫరా చేయాల్సి ఉంది.7,28,874 గొర్రెల దాణాకు రూ.247.81కోట్లుకేటాయిం చారు. ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల70 వేల యూనిట్లకు దాదాపు రూ.125 కోట్ల 76లక్షలు ఖర్చు చేసి 76,220 టన్నుల దాణా గొర్రెల లబ్ధిదారులకు అందించాలి. అయితే ఇప్పటి వరకు అందులో సగం గొర్రెలకు కూడా దాణా అందించలేదు. వేసవిలో పూర్తిస్థాయిలో దాణా సరఫరాచేస్తామని అధికారులు చెప్పినట్టు గొర్ల కాపరులుచెబుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితి ఉందని, మేత దొరకడం లేదని వారు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.