
రాబోయే 10 ఏళ్లలో మన ప్రపంచం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? వేగంగా మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా రాబోయే రోజుల్లో మన జీవితాలను పూర్తిగా మార్చబోతోంది. మనం జీవించే విధానం నుండి పనిచేసే, ఆలోచించే విధానం వరకు మారబోయే కొన్ని టెక్నాలజీల గురించి చూస్తే....
1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) : AI కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే వరకే కాదు, కానీ మనిషి ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి అన్ని రంగాలలో స్థానాన్ని సంపాదించుకుంది. భవిష్యత్తులో AI చాలా స్మార్ట్‌గా మారుతుంది, డాక్టర్లలాగే వ్యాధులను, వ్యాధి లక్షణాలు ఇంకా నివారణలు గుర్తుంచగలదు. అలాగే న్యాయవాదులాగా న్యాయ సలహా ఇవ్వగలదు, సినిమాలు, పుస్తకాలు కూడా రాయగలదు.
2. క్వాంటం కంప్యూటింగ్: ఈ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, కానీ రాబోయే 10 ఏళ్లలో క్వాంటం కంప్యూటర్లు మన ఆలోచనా సామర్థ్యాన్ని చాల రెట్లు పెంచుతాయి. కొత్త మందులు కనిపెట్టడంలో, ఖచ్చితమైన వాతావరణ అంచనాలు, అంతరిక్షానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడం సహాయపడుతుంది.
►ALSO READ | ఛాట్‌జీపీటీ ప్రతిరోజు తెగ వాడేస్తున్నారా.. ఇకపై ప్రతినెల చార్జీల మోతే !
3. 5G తర్వాత 6G నెట్‌వర్క్: ఇవాళ మనం 5G స్పీడ్ చుస్తున్నాము, కానీ రాబోయే రోజుల్లో అది 6G అవుతుంది. ఈ నెట్‌వర్క్ ఇంటర్నెట్‌ను ఇంకా స్పీడ్ చేయడమే కాకుండా, వర్చువల్ రియాలిటీని వాస్తవంగా కనిపించేలా చేస్తుంది, దింతో మనం ఎక్కడైనా ఒకరితో ఒకరు కనెక్టయి ఉండొచ్చు.
4. రోబోటిక్స్: రోబోలు కంపెనీల్లో పనిచేయడమే కాకుండా, మన ఇళ్లలో కూడా ఒకరిల మారతాయి. ఈ రోబోలు వంట చేయడం నుండి వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం, ఫ్రెండ్స్ లాగ మనతో మాట్లాడగలవు.
5. అంతరిక్ష టెక్నాలజీ & మార్స్ మిషన్: రాబోయే కాలంలో మనుషులు భూమి కాకూండా కొత్త ప్రపంచంపై దృష్టి పెడతారు. చంద్రుడు, అంగారక గ్రహంపై మనుషులు ఉండేందుకు ఇల్లులు నిర్మించే ప్రయత్నాలు వేగం అవుతాయి, అంటే స్పేస్‌ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు పెద్ద మార్పును తీసుకువస్తాయి.