
చాట్‌జిపిటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు, అయితే ఏ సమాచారమైన, ఎలాంటి ఫోటోలు కావాలన్న క్షణాల్లో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఛాట్‌జీపీటీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ పేరుతో చార్జెస్ వసూల్ చేందుకు రెడీ అయింది. OpenAI ఇండియాలో ChatGPT Go అనే కొత్త ప్లాన్ (ChatGPT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్)ను ప్రారంభించింది. దీని ధర నెలకు కేవలం రూ. 399. దీనిని UPI ద్వారా ఈజీగా ఆక్టివేట్ చేసుకోవచ్చు.
కొత్త ప్లాన్‌లో ఏముంటుందంటే :
ChatGPT Goలో GPT-5కి యాక్సెస్ ఉంటుంది. అంటే ఫ్రీ ప్లాన్ (OpenAI ChatGPT Go సబ్‌స్క్రిప్షన్) కంటే 10 రెట్లు ఎక్కువ ఫీచర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది.
*మెసేజెస్ లిమిట్ 10 రెట్లు ఎక్కువ
*10 రెట్లు ఎక్కువగా ఇమేజ్ జనరేషన్
*10 రెట్లు ఎక్కువగా ఫైల్ లేదా ఇమేజ్ అప్‌లోడ్‌లు
ChatGPT ఇప్పటికే ఉన్న రెండు ప్లాన్స్ :
*ChatGPT ప్లస్ plan: నెలకు రూ. 1,999
*ChatGPT ప్రో ప్లాన్: నెలకు రూ. 19,900
*అంతేకాదు ChatGPT Go ఫీచర్లు కోరుకునే కస్టమర్లకు తక్కువ ధరతో బడ్జెట్ ప్లాన్ కూడా ఉంది.
ఓపెన్ఏఐ వైస్ ప్రెసిడెంట్ నిక్ టర్లీ మాట్లాడుతూ చాట్‌జిపిటికి భారతదేశం రెండవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్, లక్షల మంది ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. చాట్‌జిపిటి గో ఎక్కువ మందికి తక్కువ ధరకు AI టూల్స్ ఉపయోగించుకునేలా చేస్తుందని కంపెనీ భావిస్తుంది అని అన్నారు.
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ అమెరికా తర్వాత భారతదేశం మా కంపెనీకి అతిపెద్ద మార్కెట్, రాబోయే కాలంలో ఇండియా కూడా నంబర్ వన్ మార్కెట్‌గా మారగలదు. ఇండియాలో AI వాడకం నిజంగా చాలా వేగంగా ఉంది అని అన్నారు.
ChatGPT రికార్డు: రిపోర్టుల ప్రకారం ChatGPT యాప్ ఆదాయంలో మిగతా వాటిని అధిగమించింది. ChatGPT ఆవరేజ్ ఒక్కో ఇన్‌స్టాల్‌కు రూ.253 కాగా, ఆంత్రోపిక్ క్లాడ్ ఆదాయం రూ.222, ఎలోన్ మస్క్ గ్రోక్ ఆదాయం కేవలం రూ.65.