
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో ప్రవీణ్ కండ్రేగుల రూపొందించిన చిత్రం ‘పరదా’. దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించారు.
ఆగస్టు 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్. డైరెక్టర్ ప్రవీణ్ చాలా ప్యాషన్‌తో తీశారు. తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న దర్శన ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. సంగీత గారు ఈ సినిమాకి మరో బిగ్ పిల్లర్.
చిరంజీవి గారి బర్త్‌డే రోజున సినిమా రిలీజ్ అవడం ఆనందంగా ఉంది. రివ్యూస్ చూసే సినిమాకు వెళ్లండి’ అని చెప్పింది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ అని, ప్రేక్షకులు ఒక మ్యాజిక్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేస్తారని దర్శన రాజేంద్రన్ చెప్పింది.
ఉమెన్ పవర్ చూపించే సినిమా ఇదని రాగ్ మయూర్ అన్నాడు. ఈ కంటెంట్ ఆడియెన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు.