Nandamuri Family: నందమూరి కుటుంబంలో విషాదం..

Nandamuri Family: నందమూరి కుటుంబంలో విషాదం..

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ (62) కన్నుమూశారు. ఇవాళ మంగళవారం (ఆగస్ట్ 19న) ఉదయం ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని సినీ వర్గాల సమాచారం. కాసేపట్లో హైదరాబాద్కు నందమూరి, దగ్గుపాటి, ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు చేరుకోనున్నారు. పద్మజ మృతితో నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జయకృష్ణ భార్య పద్మజ.. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి. అంతేకాదు హీరో నందమూరి చైతన్య కృష్ణ వాళ్ళ అమ్మనే ఈ పద్మజ. ఇటీవలే 'బ్రీత్' అనే మూవీతో చైతన్య కృష్ణ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.