
ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఖాయమైంది. ఎన్నిక షురూ అయ్యింది. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని బరిలోకి దించటంతో.. 2025, సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. బీజేపీ NDA కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ బరిలోకి దిగుతుండగా.. ఆయనకు పోటీగా ఇండియా కూటమి నుంచి బి.సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా బరిలో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటీ.. వాళ్ల చదువు, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానం తెలుసుకుందాం..
ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి :
పూర్తి పేరు: బాలకృష్ణ సుదర్శర్ రెడ్డి
జననం: 8 జూలై 1946
స్వస్థలం: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం, తెలంగాణ రాష్ట్రం
చదువు: ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం
ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన ఆయన అంచెలంచెలుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవి వరకు ఎదిగారు. 1988లో ప్రభుత్వ ప్లీడర్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నియమితులయ్యారు. 1993లో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీకి లీగల్ అడ్వైజర్ గా కూడా సేవలు అందించారు. 1993 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఆ తర్వాత 2007 జనవరి 12 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ గా సేవలు అందించారు. 2025 ఆగస్టు 19న ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసింది.
NDA కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ :
పూర్తి పేరు: చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్
జననం: 4 మే 1957
స్వస్థలం: తిరుప్పుర్, తమిళనాడు
చదువు: బీబీఏ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించాడు. 16 ఏండ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జన్ సంఘ్, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998,1999లో బీజేపీ ఎంపీగా గెలిచి... 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పని చేశారు.
2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పని చేయగా, ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిసై పని చేశారు. 2024 మార్చి నుంచి 2024 జూలై వరకు తెలంగాణకు అదనపు గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్రకు 24వ గవర్నర్‌గా ఉన్నారు.
►ALSO READ | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా సుదర్శన్ రెడ్డి : తెలంగాణ వ్యక్తిని బరిలోకి దించిన పార్టీలు
2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పని చేయగా, ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిసై పని చేశారు. 2024 మార్చి నుంచి 2024 జూలై వరకు తెలంగాణకు అదనపు గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్రకు 24వ గవర్నర్‌గా ఉన్నారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రతి ఎన్నిక :
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఇచ్చింది. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ.
ప్రస్తుతం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఒక ఖాళీ స్థానం ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఐదు ఖాళీలు ఉన్నాయి. ఉభయ సభల్లో ప్రస్తుతం 782 మంది సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో ఎన్డీయేకు 542 మంది సభ్యులలో 293 మంది సభ్యులు ఉన్నారు.