భక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు

భక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు

పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్​ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు.ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో పాటు కరోనా ఆంక్షలు లేకపోవడంతో రెండో భాగంలో దర్శన సమయాన్ని మార్చారు.

ఇక నుంచి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకే స్వామి వారి దర్శనం కల్పించను న్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16న శబరిమల ఆలయం తెరవగా.. సోమవారం వరకు 3 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చినట్టు చెప్పారు. సోమవారం ఒక్కరోజే 70 వేల మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు.