
అనుకోకుండా జరిగిన ఓ ఘటనే ముద్దు పుట్టుకకు కారణమని ఆంత్రోపాలజిస్టులు అంటున్నారు. తర్వాత ప్రతీ ఒక్కరికి ఇది అలవాటైందని చెబుతున్నారు. చింపాజీల నుంచి ముద్దు పుట్టిందని అభిప్రాయపడుతున్నారు. చింపాజీల పిల్లలు సొంతంగా తినలేవు. తల్లి చింపాజి ఫుడ్‌ను తన నోట్లో నములుతది. తర్వాత పిల్లల నోటికాడికి తెచ్చి ఇస్తది. పశువుల్లో కూడా ఇది చూశాం. చింపాజీలు ఇప్పటికీ దీన్నే ఫాలో అవుతున్నాయి. తల్లి నోటి నుంచి పిల్ల నోటికి ఫుడ్ అందించడాన్ని ‘‘ప్రీమెస్టికేషన్ ఫుడ్ ట్రాన్స్‌ఫర్’’ అంటారు. మనుషుల్లో అయితే.. తమ పూర్వీకుల నుంచి ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ అయినట్టు తెలుస్తున్నది.
యాక్సిడెంటల్‌గా పుట్టిన ముద్దు
ఆంత్రోపాలజిస్టులు ముద్దుకు రెండో థియరీ కూడా చెప్పారు. యాక్సిడెంటల్‌గా జరిగిన ఓ ప్రక్రియే ముద్దు పుట్టుకకు కారణమని అంటున్నారు. దీనిపై టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఆంత్రోపాలజిస్టులు చాలా స్టడీ చేశారు. ఒకరినొకరు వాసన చూసుకునే టైంలోనే ముద్దు పుట్టిందని చెబుతున్నారు. చాలా ఏండ్ల కింద ఒకరిని ఒకరు వాసన చూసుకునేవారు. ఇలా చేయడం కొన్ని తెగల్లో ఓ సంప్రదాయంగా కూడా ఉండింది. ఇలా వాసన చూసుకుంటూ ఇద్దరి పెదాలు కలవడంతో ముద్దు పుట్టిందని ఏ అండ్ ఎం వర్సిటీకి చెందిన ఆంత్రోపాలజిస్టులు అంటున్నారు. యూరప్‌లో ముద్దును ఒక గ్రీటింగ్‌లా చూస్తారు. ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు కలిస్తే.. ముందుగా వారు తమ చెంపలను తాకించుకుంటారు. మరికొందరు కిస్ పెట్టుకుంటారు. ఇంకొందరు చేతిపై లేదా డ్రెస్‌పై ముద్దు పెడ్తుంటారు. ఇప్పటికీ యూరప్‌లో ఈ కల్చర్ ఉంది. క్రిస్టియన్ కల్చర్‌లో పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు లగ్గం టైంలో ముద్దు పెట్టుకుంటారు.
‘బ్యాడ్ మ్యానర్స్’ జాబితాలో కిస్
రోమ్కు చెందిన రాజు టాయిబోరిస్ లిప్ కిస్‌ను బ్యాన్ చేశాడు. లిప్ కిస్‌తో రోగాల బారిన పడ్తారనేది అతని వాదన. ఈజిప్టు నుంచి ఇటలీ, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్‌లోని చాలా ప్రాంతాల్లో లిప్ కిస్ పెట్టుకోవడం నేరంగా పరిగణించేవారు. 17వ శతాబ్దం.. ప్లేగు వ్యాధి ప్రబలిన టైంలో బ్రిటన్‌తో పాటు చాలా దేశాల్లో ముద్దు పెట్టుకోవడంపై ఆంక్షలు ఉండేవి. దీన్ని లెక్కచేయని వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేవారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు కెల్విన్ క్లూయిజ్ లిప్‌లాక్‌ను ‘‘బ్యాడ్ మ్యానర్స్”జాబితాలో చేర్చారు. అమెరికాలో ఇప్పుడు చూస్తే చాలా మంది ఓపెన్‌గా లిప్‌లాక్ పెట్టుకుంటుంటారు. కానీ, ఒకప్పుడు ఇలా చేయడం అక్కడ నేరం.
ముద్దు.. ప్రేమకు చిహ్నం. మీ లైఫ్ పార్టనర్ పట్ల ప్రేమను వ్యక్తీకరించడానికి ముద్దు ఓ మంచి మార్గంగా చెప్పొచ్చు. దీంతో పాటు ముద్దు మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మరీ దగ్గరోళ్లయితే హగ్ చేసుకుంటారు. మస్త్ ఇష్టం అయితే ముద్దు పెట్టుకుంటారు. ప్రతీ జీవికి పుట్టుక ఉన్నట్టు.. ‘‘ముద్దు”అనే రెండు అక్షరాల పదం వెనుక కూడా ఓ హిస్టరీ ఉన్నది. ముద్దు ఎలా పుట్టింది? ఫస్ట్ కిస్ ఎవరు ఇచ్చారు? అనేదానిపై ఆంత్రోపాలజిస్టులు చెబుతున్న ఇన్‌ట్రెస్టింగ్ విషయాలేంటో చూద్దాం..
‑ సెంట్రల్ డెస్క్, వెలుగు
లిప్‌లాక్ దాకా వెళ్లిన కిస్
ఇలా మొదలైన కిస్ కల్చర్.. లిప్‌లాక్ దాకా వెళ్లింది. ఇద్దరి పెదాలు కలిస్తేనే.. ముద్దు అనే స్థాయికి చేరింది. ఫ్రాన్స్‌లో కిస్‌కు ఓ స్పెషల్ స్టేటస్ కూడా ఉంది. ఫ్రెంచ్ కిస్ అనే పదం కూడా మనం వినే ఉంటాం. ఫార్మల్ కిస్‌ని ‘‘ఓస్కులమ్’’ కిస్ అని పిలుస్తారు. అయితే, రొమాంటిక్ కిస్‌ని ‘‘బేసియం కిస్” అని పిలుస్తారు. అయితే ఘాటైన ముద్దును ‘‘సావోలియం”అని పిలుస్తారు.. దీన్నే ఫ్రెంచ్ కిస్ అని కూడా అంటారు. ఫస్ట్ వరల్డ్ వార్‌కు ముందు అమెరికన్ ఆర్మీ చాలా కాలం ఫ్రాన్స్‌లో ఉంది. తర్వాత వారు ఫ్రెంచ్ కిస్ కల్చర్‌ను తమ దేశానికి తీసుకెళ్లారని చెబుతుంటారు. జులై 6న ఇంటర్నేషనల్ కిస్ డేను జరుపుకుంటారు.
ఈ దేశాల్లో ముద్దు పెట్టుకుంటే నేరం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 46 శాతం మంది మాత్రమే కిస్‌ను ఒక రొమాన్స్‌గా భావిస్తారని అమెరికన్ ఆంత్రోపాలజిస్టు అసోసియేషన్ అభిప్రాయపడింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో లిప్ కిస్‌ను చెడ్డ అలవాటుగా చెబుతుంటారు. సొమాలియాలో లిప్ కిస్‌ను వ్యాధుల వ్యాప్తికి ప్లాన్‌గా భావిస్తారు. బొలివియాలో లిప్ కిస్‌పై బ్యాన్ ఉంది. ఇలా కొన్ని దేశాల్లో ముద్దుకు స్పెషల్ స్టేటస్ ఇస్తే.. మరికొన్ని దేశాల్లో నేరంగా పరిగణిస్తారు.