రోజూ పొద్దున్నే లేవగానే ఓ కప్పు కాఫీ పడితేనే రోజంతా సరిపడే ఉత్సాహాన్నిస్తుంది. మధ్యాహ్నం కాస్త అలసినట్లనిపిస్తే ఇంకో కప్పు కాఫీ ఉత్తేజాన్నిస్తుంది. సాయంత్రం మరో కప్పు కాఫీ రోజంతా ఉన్న ఒత్తిడిని దూరం చేస్తుంది. సరదాగా ఉన్నప్పుడు కూడా కావాల్సిన వారితో కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ ఓ కాఫీ తాగితే ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. మూడ్ ఏదైనా కాఫీ కామన్. ఎప్పుడూ కాఫీ తాగుతూ దాని రుచిని ఆస్వాదిస్తాం కదా! ఈ సారి దాని గురించి కాస్తంత తెలుసుకుందాం..?
కాఫీఇది కేవలం డ్రింకు కాదు. చాలామంది ఇళ్లల్లో కాఫీ ప్రతి రోజూ తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే ఐదో కల్చర్ .. ఇంటికొచ్చిన అతిధికి మంచి కాఫీ అందించడం ఓ స్టేటస్. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఓ ఆర్ట్ ఇది ఎనర్జీనిస్తుంది. అందుకే సైన్స్ కూడా ప్రియుడు లేదా ప్రియురాలిని కాఫీ షాప్‌కు తీసుకెళ్లి టేస్ట్ కాఫీ తాగడం ఓ రొమాన్స్ ఇన్ని ఎమోషన్స్ పలికించే కాఫీకి ప్రపంచం ఫిదా అవ్వకపోతే ఏమవుతుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఇష్ట మైన డ్రింకుగా మారింది
చరిత్ర
కాపీ ఎప్పుడు వాడుకలోకి వచ్చిందనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఎక్కువ మంది సమ్మకం ప్రకారం క్రీ. శ. 850 నుంచి. -దీన్ని డ్రింకుగా తీసుకుంటున్నారు. అప్పట్లో ఇది యోపియాకు చెందిన ఖలీద్ అనే ఓ సూపీ దీన్ని తయారు చేశాడని నమ్ముతారు. ఓ రోజు గొర్రెలు కాఫీ గింజలు తిని ఉత్సాహంగా ఉండడాన్ని ఖలీద్ గమనించాడు. కాఫీ గింజల్లో ఏదో శక్తి ఉందని గ్రహించిన ఆయన ద్వారా ప్రపంచంలో మొదటి కాఫీ తయారైంది. కాఫీ గింజల్ని వేడి నీటిలో కరిగించి తాగేవారు. క్రమంగా దీని రుచి గురించి ఇతర దేశాలకూ వ్యాపించింది. మనదేశంలోనూ కాఫీ తోటల్ని పెంచుతున్నారు. కేరళ, కర్ణాటక.. తమిళనాడుసహా అనేక రాష్ట్రాలో కాఫీ తోటలు అధికంగా ఉన్నాయి.
ఇప్పుడంటే కాపీని కేవలం డ్రింకుగానే తీసుకుం టున్నాం కానీ ఒకప్పుడు దీన్ని ఆహార పదార్థంగా కూడా తీసుకునేవారు. చెర్రి పండ్లలా ఉండే వీటిని జంతువుల కొవ్వుతో కలిపి స్నాక్స్‌గా తీసుకునేవారు. 13 వ శతాబ్దం నుంచి కాఫీ గింజలను వేయించి డ్రింకుగా తీసుకోవడం ఎక్కువైంది. అప్పటినుంచే ఇది మరింత మందికి చేరువైంది. కాఫీని 15వ శతాబ్దంలో ఎక్కువగా అరబ్బులు పండించేవారు. ఆ తర్వాత 16వ శతాబ్దానికి ఈజిప్టు, టర్కీలకు వ్యాపించింది. ఆ తర్వాత ఇతర దేశాలకూ విస్తరించింది. ఇళ్లల్లో తయారు చేసుకోవడమే కాకుండా, బయట కూడా కాఫీని అమ్మేవారు అలా ఇది సోషల్ డ్రింకుగా మారింది. మెల్లిగా కాఫీకి ఆదరణ పెరగడంతో .. ఇది 17వ శతాబ్దం నుంచి పూర్తి వ్యాపారమయమైంది. కాఫీని వాణిజ్యవరం గా ఉత్పత్తి చేయడం మొదలైంది.
ఉత్పత్తి
ప్రస్తుతం దాదాపు 70కి పైగా దేశాల్లో కాపీ గింజల్ని పండిస్తున్నారు కాఫీలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి అరబికా రెండోది రోబస్టా. అరబికా రకం కాఫీ తోటలు సముద్ర మట్టానికి ఎనిమిది నుంచి రెండు వేల ఎతైన ప్రదేశాల్లో పెరిగితే, రోబస్టా రకం సముద్ర మట్టానికి దిగువున ఉండే ప్రదేశాల్లో పెరుగు తాయి: ఈ మొక్కలు చాలా చిన్నవిగా పొదల రూపంలో ఉంటాయి. వీటి నుంచి లభించే చిన్న పండ్లు చెర్రీల్లా ఉంటాయి. వాటిని ఎండబెట్టి, పైనున్న తొక్కతీసి గింజలను సేకరిస్తారు. ఈ గింజల నుంచే కాఫీ తయారవుతుంది. సేకరించిన గింజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వ్యయప్రయాసలతో కూడు కున్నది.
మంచిదా..? కాదా..?
కాఫీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో. అన్ని నష్టాలున్నాయన్నది ఆరోగ్య నిపుణులు చెప్పే మాట ముందుగా కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. పలు అధ్యయనాల్లో తేలిన విషయాలివి.
- కాఫీ ఎక్కువగా తాగేవారికి టైప్ 2 డయబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
- పార్కిన్సన్ వచ్చే ముప్పు తగ్గుతుంది. లివర్
- క్యాన్సర్, ఇతర కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది.
- హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా కాపాడుతుంది. కొలొరెక్టల్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది.
దుష్ప్రభావాలు
- ఎక్కువగా కాఫీ తాగితే నిద్రలేమి సమస్యలు వస్తాయి
- బయాలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది. హైట్ రేటెన్షన్ కు దారితీయొచ్చు..
- ఒంట్లోని కొవ్వు శాతం పెరిగేలా చేస్తుంది. లావుగా ఉన్నవారు కూడా కాఫీకి దూరంగా ఉండాలి.
- రోజు ఐదు కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగి కూడదని నిపుణుల సూచన. గర్భిణులు ఒక కప్పుకంటే ఎక్కువ కాఫీ తాగకూడదు
