బై ఎలక్షన్స్​లో బీజేపీ హవా

బై ఎలక్షన్స్​లో బీజేపీ హవా

వివిధ రాష్ట్రాల్లో జరిగిన బైఎలక్షన్స్ లో బీజేపీ సత్తా చాటింది. 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు 40 స్థానాలను చేజిక్కించుకుంది. మధ్యప్రదేశ్ లో 19 సీట్లు గెలుచుకుంది. దీంతో అక్కడ బీజేపీ నాయకత్వంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారుకు పూర్తి మెజారిటీ దక్కింది. గుజరాత్ లో 8 స్థానాలు, యూపీలో 6 స్థానాల్లో గెలిచింది. మణిపూర్ లో 5 స్థానాలకు గాను 4, కర్నాటక 2, తెలంగాణలో దుబ్బాక స్థానంలో బీజేపీ గెలిచింది.

భోపాల్/లక్నో/అహ్మదాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన బైఎలక్షన్స్ లో బీజేపీ సత్తా చాటింది. మంగళవారం జరిగిన కౌంటింగ్ లో 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు గాను 40 స్థానాలను చేజిక్కించుకుంది. మధ్యప్రదేశ్ లో 19 సీట్లను గెలుచుకుంది. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు గండం నుంచి గట్టెక్కింది. గుజరాత్ లో 8 స్థానాలు, యూపీలో 6 స్థానాల్లో గెలిచింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయ్యింది. కరోనా వ్యాపిస్తున్నందున ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ హాల్స్ లో తక్కువ మందిని మాత్రమే అనుమతించింది. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంది. హర్యానా, చత్తీస్ గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, ఒడిశా  మినహా మణిపూర్ లో 5 స్థానాలకు గాను 4, కర్నాటక 2, తెలంగాణలో దుబ్బాక స్థానంలో బీజేపీ గెలిచింది.

మధ్యప్రదేశ్ సర్కార్ సేఫ్

మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 19 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మధ్యప్రదేశ్ లో బీజేపీ నాయకత్వంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారుకు పూర్తి మెజారిటీ దక్కింది. మధ్యప్రదేశ్ లో తన అనుచర ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ను వీడిన జ్యోతిరాదిత్య సింధియా..  కమల్ నాథ్ సర్కారును కూలదోసి బీజేపీలో చేరారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ సీఎం అయ్యారు. బీజేపీకి సొంతంగా 107 మంది ఎమ్మెల్యేలున్నా..  సింపుల్ మెజారిటీ (229)కి 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉండేది. ప్రస్తుతం బైఎలక్షన్స్ లో జ్యోతిరాదిత్య సింధియా అనుచరులు సత్తా చాటండతో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు పూర్తి మెజారిటీ సాధించి.. గండం నుంచి గట్టెక్కింది.

గుజరాత్‌లో క్లీన్‌ స్వీప్‌..

గుజరాత్‌లోనూ బైఎలక్షన్స్‌‌ జరిగిన 8  అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది. చూపీలో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన బైఎలక్షన్స్ లో ఆరు చోట్ల బీజేపీ గెలిచింది. ఒక స్థానంలో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించింది. మణిపూర్​లో 5 అసెంబ్లీ స్థానాలకు జరిగిన బైఎలక్షన్స్‌ లో బీజేపీ 4 చోట్ల గెలిచింది.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో అక్కడ బైఎలక్షన్స్ వచ్చాయి. కర్నాటకలోని శిరా, రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. జేడీఎస్ ఎమ్మెల్యే బి.సత్యనారాయణ మృతితో శిరాలో, గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మునిరత్న రిజైన్ చేయడంతో ఆర్ఆర్‌నగర్​లో బైఎలక్షన్స్ వచ్చాయి.