హాట్ వాటర్ ఛాలెంజ్.. అమెరికాలో ఇప్పుడిదే ట్రెండింగ్

హాట్ వాటర్ ఛాలెంజ్.. అమెరికాలో ఇప్పుడిదే ట్రెండింగ్

ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా దానిపై సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడమో, వింతగా ఛాలెంజ్ విసరడమో చేస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు అమెరికాలో # బాయిలింగ్ వాటర్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. దానికి విశేష స్పందన లభిస్తుంది. గడ్డ కటించే చలిలోనూ ఆ ఛాలెంజ్ చేస్తూ సరదాగా ఫొటో దిగుతూ, వీడియోలు తీస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ బాయిలింగ్ వాటర్ ఛాలెంజ్ ఏంటంటే.. గడ్డకట్టే చలిలో సలసల మరిగే నీళ్లను గాల్లోకి విసరాలి. అవి నేలను తాకితే ఈ ఛాలెంజ్ లో గెలిచినట్లు. అయితే, అమెరికాలో బాంబ్ సైక్లోన్ వల్ల ఇప్పుడు ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వేడినీళ్లు సైతం గడ్డ కట్టుకుపోతున్నాయి. # బాయిలింగ్ వాటర్ ఛాలెంజ్ చేసిన వాళ్లంతా గిన్నెలో నీళ్లు తీసుకొచ్చి పైకి విసిరిన మరుక్షణమే మరుగుతున్న నీళ్లు సైతం గడ్డ కట్టుకుపోతున్నాయి. అయితే, దీన్నె సరైన టైంగా భావించి కొందరు క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. నీళ్లుపైకి విసిరి ఫొటోలు దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండవుతున్నారు.