కుక్క, కోతి, కోడి.. జాతివైరం మర్చి.. ఫ్రెండ్ షిప్

కుక్క, కోతి, కోడి.. జాతివైరం మర్చి.. ఫ్రెండ్ షిప్

కుక్క అంటే కోతికి పడదు.. కుక్కను చూస్తే కోడికి పడదు.. కోతిని చూస్తే కుక్క అరుస్తుంది.. ఈ మూడు ఇప్పుడు ఫ్రెండ్ షిప్ చేశాయి.. కుక్క, కోతి, కోడి.. ఈ మూడు హాయిగా కలిసిమెలిసి ఉంటున్నాయి.. కుక్కపై కోతి పడుకుంది.. కోడిని దగ్గరకు తీసుకుని చక్కగా నిమురుతుంది కోతి.. ఇలాంటి అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కోతి, కుక్క, కోడి సరదాగా ఆడుకోవడం, కౌగిలించుకోవడం కనిపిస్తోంది. అంతే కాదు జీన్స్ వేసుకున్న కోతి.. కోడి ఈకల్లో పేలు వెతుకుతూ, కుక్కపై పడుకోవడం చాలా ఫన్నీగా అనిపిస్తోంది. ఈ వీడియోను Nature is Amazing అనే పేజీ షేర్ చేసి, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనే క్యాప్షన్ ను జత చేసింది.

ఈ ముగ్గురి స్నేహం చూసి ఇంటర్నెట్ కూడా ఆశ్చర్యపోతోంది. దీంతో పలు ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నవంబర్ 29న Xలో షేర్ అయింది. ఇప్పటి వరకు ఇది 10.9 మిలియన్లకు పైగా వ్యూస్ ను పొందింది.