బాలుడి స్మార్ట్​ ఫిషింగ్​.. ఫిదా అవుతున్న నెటిజన్లు

బాలుడి స్మార్ట్​ ఫిషింగ్​.. ఫిదా అవుతున్న నెటిజన్లు

ఓ పిల్లాడు ఫిషింగ్​ చేస్తున్న వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ప్రతిభకు వయస్సు అడ్డు కాదని ఆ బాలుడు నిరూపించాడు.  ఆ బాలుడికి సంబంధించిన వీడియో ట్విటర్​లో ది బెస్ట్​ అనే పేజీలో షేర్​ చేశారు. వెంటనే సోషల్​మీడియాలో చాలా మంది దాన్ని షేర్​ చేశారు. ఆ వీడియోలో బాలుడు.. లోతులేని నీటి ఒడ్డున మాంజాతో జతచేసిన రెండు చెక్క దుంగలను భూమిలోకి పంపుతాడు. తన వెంట తెచ్చుకున్న పిండి ముద్దలను మాంజాకి చివర్లో పెట్టి నీటిలోకి వేస్తాడు. కాసేపు ఓపిక పట్టాక మాంజా తిరగడం ప్రారంభమవుతుంది. దీంతో మాంజాను బయటకి తీస్తాడు. ఇంకేముంది రెండు పెద్ద చేపలు ఆ బుడ్డోడి వలలో చిక్కాయి.  "సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం"  అని నెటిజన్లు కామెంట్​​చేస్తున్నారు.  అది కదా స్మార్ట్​ ఫిషింగ్​ అని బాలుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో మిలియన్ల కంటే ఎక్కువ వ్యూయర్​షిప్​ని సంపాదించింది.