ఫుల్లుగా తాగాక బావను కొట్టి చంపిన బామ్మర్దులు

V6 Velugu Posted on Sep 21, 2021

అచ్చంపేట, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో కుటుంబ కలహాలతో సొంత బావను బామ్మర్దులే కొట్టి చంపారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన పంబ మలయ్య(40), అదే గ్రామానికి చెందిన పుష్పను కొన్నేండ్ల క్రితం పెండ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇటీవల తరచూ భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బావమరిది గణేశ్, వరుసకు బామ్మర్దులు అయ్యే గట్టు తుమ్మెన్​ గ్రామానికి చెందిన శంకర్, పోతిరెడ్డిపల్లికి చెందిన కురుమయ్య.. మల్లయ్యను మందు తాగుదామని గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఫుల్లుగా తాగాక అంతా కలిసి మల్లయ్యను చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు వారి నుంచి తప్పించుకుని ఊర్లోకి వెళ్లాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే మల్లయ్యను అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. సీరియస్​అవ్వడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మల్లయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tagged nagar kurnool district, killed, beaten, brother-in-law,

Latest Videos

Subscribe Now

More News