రాష్ట్రంలో మోడీ తరహా పాలన కోరుకుంటున్నారు

రాష్ట్రంలో మోడీ తరహా పాలన కోరుకుంటున్నారు

కేంద్రంలో ప్రధాని మోడీ వంటి పాలన.. రాష్ట్రంలో నూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి  సంజయ్ అన్నారు. ప్రజలు మోడీ చేపడుతున్న పలు సంక్షేమ పథకాల పట్ల ఆసక్తి చూపుతున్నారన్నారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ పనితీరుపై తీవ్రమైన అసహనంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. గురువారం బీజేపీ ఆఫీసులో కొత్తగా నియమితులై న ఆఫీస్బేరర్లు బాధ్యతలు తీసుకున్నారు.
వాళకు్ల నియామక పత్రాలు అందజేసి ప్రమాణం చేయించారు సంజయ్ . ఎన్నికలు ఎప్పడొచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కొత్త ఆఫీస్ బేరర్లు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీనిర్టీ గ్రామ స్థాయిలో పటిష్ట పరిచేందుకు కొత్త పదాధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. జిల్లాల్లో ని
నాయకులు, కార్యకర్తలను సమన్వయంచేసుకుంటూ పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.

కళకళలాడిన బీజేపీ ఆఫీస్ 

కొత్త ఆఫీస్బేరర్లు బాధ్యతలు చేపట్టడడంతో వారిని అభినందించేందుకు ఆయా జిల్లాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు బొకేలు, శాలువాలతో పార్టీ ఆఫీసుకు తరలివచ్చారు. దీంతో బీజేపీ ఆఫీస్ నేతల సందడితో కళకళలాడింది. మైనారిటీల సంక్షేమం కోసం మోడీ సర్కార్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన బుక్ను బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్రఅధ్యక్షుడు అఫ్సర్ పాషాతో కలిసి సంజయ్విడుదల చేశారు. మైనారిటీ నేతలను
ఆయన అభినందించారు. పదాధికారులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళలో పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, స్టేట్ ఆఫీస్ సెక్రటరీ ఉమా శంకర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొల్లిమాధవి చౌదరి తదితరులున్నారు. పార్టీ సంస్థాగత రాష్ట్రప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, మరో ప్రధాన కా ర్య దర్శి ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.