మాంజా ఇవ్వలేదని కత్తి పొడిచిండు.. IS సదన్ పోలీసులు కేసు నమోదు

మాంజా ఇవ్వలేదని కత్తి పొడిచిండు.. IS సదన్ పోలీసులు కేసు నమోదు

ఓల్డ్​సిటీ, వెలుగు: మాంజా అడిగితే ఇవ్వలేదని ఓ యువకుడిని మరో యువకుడు కత్తితో పొడిచాడు. ఐఎస్​సదన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈదిబజార్​కు చెందిన మహమ్మద్​జియా రెహాన్​గురువారం మధ్యాహ్నం తన అమ్మమ్మ ఇంటిపై గాలిపటం ఎగురవేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జైద్ అలీఖాన్ మాంజా ఇవ్వాలని అడిగాడు. ఇవ్వకపోవడంతో ఇంట్లోకి వెళ్లి కత్తి తెచ్చి, జియా రెహాన్​చాతిపై పొడిచాడు. అతనికి తీవ్ర గాయం కావడంతో కుటుంబసభ్యులు ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.