వర్షాలకు కొట్టుకపోయిన లోతు ఒర్రె కాజ్​వే.. ఆరు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వర్షాలకు కొట్టుకపోయిన  లోతు ఒర్రె కాజ్​వే.. ఆరు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  •     నాలుగేండ్లలో ఇది మూడోసారి
  •     ఆరు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

కోటపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు కోటపల్లి మండలం మల్లంపేట – నక్కలపల్లి గ్రామాల మధ్య ఉన్న కాజ్‌‌‌‌‌‌‌‌వే కొట్టుకుపోయింది. దీంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్కలపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో లోతుఒర్రెపై గతంలో నిర్మించిన కాజ్‌‌‌‌‌‌‌‌వే 2020 ఆగస్టులో భారీ వర్షాలకు మొదటి సారి కొట్టుకుపోయింది. తర్వాత రూ.7.50 లక్షలతో చెన్నూరుకు చెందిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ కాజ్‌‌‌‌‌‌‌‌వే రిపేర్లను పూర్తి చేశారు. పనులను క్వాలిటీగా చేయకపోవడంతో మరుసటి ఏడాది కురిసిన వర్షాలకు మరోసారి కొట్టుకుపోయింది. అప్పుడు గ్రామస్తులే తాత్కాలికంగా రిపేర్లు చేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాజ్‌‌‌‌‌‌‌‌వే మూడోసారి తెగిపోయింది.

 దీంతో నక్కలపల్లి, బద్దంపల్లి, బ్రాహ్మణపల్లి, బొమ్మెన, చామనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి చొరవచూపి లోతుఒర్రెపై శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాజ్‌‌‌‌‌‌‌‌వేకు రిపేర్లు చేసిన కోటపల్లి పోలీసులు నక్కలపల్లికి వెళ్లే మార్గంలోని లోతుఒర్రె కాజ్‌‌‌‌‌‌‌‌వే కొట్టుకుపోయి గ్రామస్తులు ఇబ్బందులు పడుతుండడంతో కోటపల్లి పోలీసులు స్పందించి తాత్కాలిక రిపేర్లు చేసి రాకపోకలు పునరుద్ధరించారు. చెన్నూరు రూరల్‌‌‌‌‌‌‌‌ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్సై రాజేందర్‌‌‌‌‌‌‌‌ తమ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి కాజ్‌‌‌‌‌‌‌‌వే వద్ద రిపేర్లు చేయించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.