అనాథలను కేంద్రం దత్తత తీసుకుంటుంది

అనాథలను కేంద్రం దత్తత తీసుకుంటుంది
  • భవిష్యత్తు లో వారికి ఎలాంటి అవసరం ఉన్నా ఆదుకుంటాం

సిద్దిపేట జిల్లా: తల్లిదండ్రులు లేని కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి దత్తత తీసుకుంటుందని, భారత ప్రభుత్వం పీఎం కేర్ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని  ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీఎం కేర్ పర్ చిల్డ్రన్ కార్యక్రమంలో బాగంగా  కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 10లక్షల రూపాయల చెక్కులను బాధితులు అనూష, మధుసూధన్, దివాకర్ లకు అందజేశారు. జిల్లాలో 9మంది బాధితులు ఉన్నారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయని ప్రస్తావిస్తూ.. మన దేశంలో తల్లి తండ్రులను కోల్పోయిన కుటుంబాలను భారత ప్రభుత్వం గుర్తించి దత్తత తీసుకుంటోందన్నారు. 10 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్, 5లక్షల అయుష్ యోజన ఇన్సూరెన్స్ , చదువుకునే వారికి స్కాలర్ షిప్ ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరం ఉన్న ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 
 

ఇవి కూడా చదవండి

వారంలో రాష్ట్రానికి రుతుపవనాలు

సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం

సర్కార్ వారి పాట సినిమా చూస్తా