హైదరాబాద్ - ముంబై - చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్

హైదరాబాద్ - ముంబై - చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్
  • హైదరాబాద్ - ముంబై - చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్
  • మరో ఆరు కారిడార్​లకూ డీపీఆర్​లు తయారు చేస్తున్నం
  • లోక్ సభకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు : హైదరాబాద్– ముంబై–చెన్నైతో పాటు మరో ఆరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ల తయారీ పనిని రైల్వే శాఖ ప్రారంభించిందని కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో రైలు కోచ్ ఫ్యాక్టరీ పెట్టే ప్రతిపాదన ఏదీ లేదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

రైల్వే  కోచ్ ల తయారీకి అవసరమైన ఫ్యాక్టరీలను ఇప్పటికే మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్ మెంట్లలో 2021 మార్చి 1 నాటికి 9, 79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంపీ నామా అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఇందులో అత్యధికంగా రైల్వేలో 2,33,943 ఉద్యోగాలు, డిఫెన్స్ లో 2,64,706, హోం శాఖలో 1,83, 538 జాబ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.