తెలంగాణ ఆర్టీసీలో హైబ్రిడ్ జీసీసీ మోడల్కు ఒప్పుకోలేమన్న కేంద్రం..

తెలంగాణ ఆర్టీసీలో హైబ్రిడ్ జీసీసీ మోడల్కు ఒప్పుకోలేమన్న కేంద్రం..

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రవాణా వ్యవస్థను విద్యుద్ధీకరించే దిశలో ఈ–బస్సుల విస్తరణకు ప్రపోజల్ పంపినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా పీఎం ఈ–డ్రైవ్ కింద 2,800 ఈ– బస్సుల కోసం రిక్వెస్ట్ చేసిందని తెలిపింది. అయితే, ఉద్యోగ భద్రత కోణంలో రాష్ట్రం సూచించిన హైబ్రిడ్‌‌ జీసీసీ మోడల్​కు మద్దతివ్వలేమని స్పష్టం చేసింది. 

ఈ మేరకు మంగళవారం (జులై 29) లోక్ సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం పీఎం ఈ–డ్రైవ్‌‌ పథకం కింద విద్యుత్‌‌ బస్సులను సీఈఎస్‌‌ఎల్‌‌ సంస్థ టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. 

తెలంగాణకు వాహనాల పంపిణీ ఓఈఎం ద్వారా జరిగితే, వాటిని నడిపే, నిర్వహించే బాధ్యత టీజీఎస్‌‌ఆర్‌‌టీసీ సిబ్బందిదేనని  తేల్చి చెప్పారు. దీన్ని హైబ్రిడ్‌‌ జీసీసీ 
మోడల్‌‌ గా వ్యవహరిస్తారని తెలిపారు.